Local news

కేటీఆర్ ను కలసిన ప్రకాష్ రాజ్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తో శనివారం సినీనటుడు ప్రకాష్ రాజ్ భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి అంశంపైన ప్రకాష్ రాజ్ మంత్రి కేటీఆర్ తో చర్చించారు. ఈ గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి కేటాయించిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై భేటీ సందర్భంగా చర్చించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కలసి పని చేద్దామని కేటీఆర్ తెలిపినట్లుగా పేర్కొన్నారు……. KS
84

Comment here