ఇండోనేషియాలో భారీ భూకంపం.. 10 మంది మృతి

చిన్న చిన్న దీవుల సమూహం అయిన ఇండోనేసియాలోని లోమ్ బాక్ దీవిలో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 10 మంది మృతి చెందగా… 24 మంది గాయపడ్డారు. తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4 గా నమోదయ్యింది. భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here