Local news

పవన్ జగన్ ల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం

ఏపీలో రోజు రోజుకీ పొలికల్ హీట్ రోజు రోజుకీ అధికం అవుతుంది. జగన్ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయక ముందు వరకూ… ఇద్దరు 2019 ఎన్నికల్లో కలిసి నడుస్తారని.. టాక్ వినిపించేది… కానీ తాజాగా జగన్‌… పవన్‌ల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం పొలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి… ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలుసంధించుకుంటున్నారు. ఇన్నిరోజులుగా ఇద్దరూ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుంటారని.. కలిసి నడుస్తారని చేస్తోన్న ఊహాగానాలు తాజా పరిణామాలతో పటాపంచలయ్యాయి..

జగన్‌ జనసేనాని పవన్ పై చేసిన విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపాయి… ఈ వ్యాఖ్యలపై అటు పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్ వేదికగా జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని.. ఈ వివాదంపై ఆ ఇంటి ఆడపిల్లలను లాగవద్దని… స్పందించారు.. అంతేకాదు.. భీమవరం లో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా కూడా కౌంటర్‌ అటాక్‌ ఇవ్వడంతో వైసీపీ, జనసేన మధ్య వార్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది…

జగన్‌ జైలు జీవితం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావిస్తూ పవన్‌ విమర్శలు సంధించారు. ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని తెగేసి చెప్పారు.. చంద్రబాబును ఎదుర్కోలేక జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని పవన్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనాయకుడికి ఉన్న శక్తి మీకేం తెలుసు? ప్రజాస్వామ్య వ్యవస్థను మీరు వాడుకోవట్లేదు అని జగన్‌కు ధీటుగానే బదులిచ్చారు జనసేనాని.

జగన్ ఏమైనా చేయాలంటే.. తాను సీఎం అయ్యాకే అంటారు… ఆయనలాగా మాకు ఎమ్మెల్యేలు ఉంటే.. ప్రతి పక్షం అంటే ఏమిటో చెప్పేవాడిని.. అసెంబ్లీని ఒక ఊపు ఊపేవాడినన్నారు. జగన్‌ చేసిన వ్యక్తిగత విమర్శలను తట్టుకోగలనని… తాను గుండెల్లో అగ్ని గోళాలు పెట్టుకుని తిరుగుతున్నానని… తనను రెచ్చగొట్టకండి అంటూ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు పవన్‌… తన జీవితం తెరిచిన పుస్తకమని.. తాను వ్యక్తిగతంగా వెళితే మీరు ఊపిరి పీల్చుకోలేరు. తట్టుకోలేరు, పారిపోతారు అంటూ ధ్వజమెత్తారు.

అటు వైసీపీ నేతలు సైతం పవన్‌ను టార్గెట్‌ చేశారు… విలువలుగల రాజకీయం ఎవరిదని నిలదీశారు.. జగన్‌ రాజేసిన నిప్పు దావనలంలా కొనసాగుతూనే ఉంది… ఈ మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించడం లేదు.. కాగా సోమి రెడ్డి, బుద్దా వెంకన్న, ఉండవల్లి వంటి వారు రాజకీయంగానే ఎదుర్కోవాలి.. కానీ వ్యక్తి గత అంశాలను ప్రస్తావించడం రాజకీయ విలువలను తగ్గించడమే అని అంటున్నారు.. అయితే కొంత మంది రాజకీయ విశ్లేషకులు ఈ విషయం పై స్పందిస్తూ… కచ్చితంగా పవన్ మూడు పెళ్లిళ్ల అంశం ఎన్నికల సమయంలో ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోందంటున్నారు.

Comment here