పీయూష్,జివీఎల్ లపై ఫైర్ అయిన టీడీపీ నేతలు

రైల్వేజోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా ముగిసింది. టీడీపీ నేతలకు పీయూష్ గోయల్ సమాధానం చెబుతుండగా జీవిఎల్ జోక్యం చేసుకున్నారు.దీంతో జీవీఎల్ కు ఏం సంబంధం ఉందంటూ టీడీపీ నేతలు ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో వాగ్వాదానికి దిగారు. కేంద్రమంత్రిని సైతం నిలదీశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగేళ్లయినా రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రైల్వే జోన్ ఎప్పుడిస్తారో నిర్దిష్ట గడువు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వీరి డిమాండ్ కు స్పందించిన పీయూష్ గోయల్.., టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక అనంతరం .., రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.దీనికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు పీయూష్ గోయల్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. జీవీఎల్ తీరుపై , అక్కడ జరిగిన వివాదాన్ని టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఈ ఘటన ను తీవ్రంగా పరిగణించాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here