Local news

పెట్రోలు, డీజిల్ లను జీఎస్టీలో చేర్చాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి

పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్లను రద్దు చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్రో ధరలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ప్రశ్నించరని పొంగులేటి సుధాకర్ రెడ్డి నిలదీశారు. క్రూడాయిల్ బ్యారెల్ ధర తగ్గినా, పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదో ప్రధాని నరేంద్ర మోదీ, దేశప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సామాన్యుల శాపాలు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభత్వాలకు తప్పకుండా తగులుతాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Comment here