పీడీ అకౌంట్స్ గవర్నమెంట్ వే : ఫైనాన్స్ సెక్రటరీ రవిచంద్ర

పీడీ అకౌంట్స్ ఎవరి వ్యక్తిగత అకౌంట్లు కావని అవి ప్రభుత్వానివే అని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిచంద్ర స్పష్టం చేశారు. ట్రెజరీ చుట్టూ తిరగకుండా కొన్ని నిధులను ఆయా శాఖల అకౌంట్లలో ఉంచుతారని చెప్పారు. విభజన తరువాత ఆంద్రప్రదేశ్ కు 43,374, తెలంగాణా కు 29,236 పీడీ అకౌంట్లు ఉన్నాయన్నారు. 13వ, 14వ ఆర్ధిక సంఘ నిధులను వేరు చేసేందుకు 13,199 అకౌంట్లు తెరచామని రవిచంద్ర చెప్పారు. నిధులు ట్రెజరీలో కాకుండా బ్యాంకులో ఉంచడం వల్ల దుర్వినియోగమవుతాయని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ నిధులను ట్రెజరీలో ఉంచుతున్నామని చెప్పారు. ఆంద్రప్రదేశ్ నమూనానే చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పీడీ అకౌంట్లపై కాగ్ అభ్యంతరాలు తప్పని రవిచంద్ర తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here