Local news

మొగల్తూరు లో తన ఇంటిని సందర్శించిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అన్న సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ జీవిత ప్రయాణం.. బాల్యం ఈ ఉరులోనే .. అన్న చిరంజీవి సినిమాల్లో అడుగు పెట్టి.. హీరోగా అడుగు పెట్టక.. సురేఖ ను పెళ్లి చేసుకున్నారు.. అందరిలో చిన్నవాడైన చిరంజీవిని వదిన సురేఖ తన వెంట మొగల్తూరు నుంచి చెన్నై తీసుకుని వెళ్ళింది.. అందుకనే తనకు చిరంజీవి సురేఖ లు అన్నావదినలు కాదని… తల్లిదండ్రులని పవన్ కళ్యాణ్ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జనసేనాని.. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన బాల్యం గడిచిన ఇంటికి వెళ్లారు.. ఆ ఇంటిలో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Comment here