స్థిరత్వం లేని నేతవరంటే అది పవన్ కల్యాణే : నుడా చైర్మన్ కోటంరెడ్డి

స్థిరత్వం లేని నేతవరంటే అది పవన్ కల్యాణే : నుడా చైర్మన్ కోటంరెడ్డి

స్థిరత్వం లేని పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నెల్లూరు లోని నుడా నుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ మొదటినుండీ స్థిరత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకరోజు ఒకమాట, మరుసటిరోజు మరొమాట మాట్లాడుతూ ప్రజల్లో చులకన అయ్యారన్నారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ అవినీతిపరుడని, ఆయన సీఎం కుర్చీపై ఆరాటపడుతున్నారని పవన్ మాట్లాడటం సిగ్గు చేతన్నారు. ఆరాటపడుతున్నదేవరో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అతి చిన్న వయస్సులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తన పనితీరుతో దేశంలోనే ప్రప్రధమంగా కేంద్రం నుంచి పంచాయితీరాజ్ తరుపున 9 అవార్డులు పొందారని గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రతివీధికి ఎల్ఈడీ లైట్లు, సిమెంట్ రోడ్లు, ఇంటింటికి కుళాయిలు వేసిన ఘనత యువ మంత్రి లోకేష్ దేన్నారు. మొన్నటివరకూ టిడిపి, చంద్రబాబును పొగిడిన నోరుతోనే ఇప్పుడు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. లోకేషను తిడితే మీరు పెద్దవాళ్లు కాలేరని, అలాగే ప్రజలు సహించబోరని హితవు పలికారు……..KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here