Local news

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ కు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, శాలువా కప్పి సన్మానించారు. పవన్ కల్యాణ్ ను తమ సెల్ ఫోన్లలో బంధించడానికి భక్తులు పోటీ పడ్డారు. అంతక ముందు కేసీఆర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నగరం నలుమూలలనుండి వచ్చిన భక్తులతో ఉజ్జయిని మహంకాళి ఆలయం కిక్కిరిసిపోయింది……KS

Comment here