పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ ఛానల్ లో షో..

వెండి తెరపై హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్… ఎప్పటి నుంచో బుల్లి తెరపై అడుగు పెట్టనున్నాడు అనే వార్తలు వినిపించాయి. ఆ మధ్య తెలుగులో ఒక ప్రముఖ ఛానల్ పవన్ తో సత్యమేవ జయతే తరహా ఒక షో నిర్వహించనున్నదని.. దానికి హోస్ట్ గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారు అనే టాక్ వినిపించింది. కాని అది కార్యరూపం దాల్చలేదు. కాగా మళ్ళీ పవన్ అధ్వర్యంలో నడుస్తున్న ఒక ఛానల్ లో ప్రసారం కాబోతున్న కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహారిస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ బుల్లి తెరపై అడుగు కార్యక్రమానికి సంబందించి క్లారిటీ వచ్చింది.
ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ ఇండియా ఏ హెడ్ అనే టాక్ షోను ప్రసారం చేయబోతున్నదని..ఆ టాక్ షోను పవన్ కళ్యాణ్ హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలలో
జరగబోతున్న స్వాతంత్ర దినోత్సవంనాడు ఆప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ అధికారికంగా త్వరలో ప్రకటించనున్నది.
ఈ షో కు అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జయతే కార్యక్రమానికి పోలినఛాయలు ఈ ఇండియా ఏ హెడ్ షో కి ఉంటాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఒక ప్రముఖ జర్నలిస్టు నేతృత్వంలో డిజైన్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలపై పరిజ్ఞానం లేదు.. ఇక సిద్ధాంతం లేదు అంటూ చేసే విమర్శలకు సమాధానంగా ఈ షో నిర్వహణ ఉండనున్నట్లు… ఈ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ అనేక జాతీయ సమస్యలపై అనేక మంది జాతీయ ప్రముఖులతో మాట్లాడుతూనే.. మధ్యలో ఏపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేసి… ఏపీ సమస్యల పట్ల అందరికీ అవగాహన తో పాటు… సానుభూతి కలిగేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఒక హీరో మాత్రమే కాదు.. సమస్యల పై అవగాహన ఉన్న ఒక జననేత అనిపించుకునేలా ఈ టాక్ షో ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here