పవన్ కళ్యాన్ కొత్త ఓటర్ ఐడి ఎక్కడ నుంచో తెలుసా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టి.. 2019 లో జరగబోయే ఎన్నికలకు రెడీ అవుతున్నాడు.. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేనాని.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజల్లో మమేకమవుతూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో నమోదు చేయించుకున్నారు. ఆయనకి అక్కడ ఓటు హక్కు వచ్చింది. పవన్ కు టిడీజెడ్ 117567 నంబరుతో ఓటరు గుర్తింపు కార్డు మంజూరు చేశారు. నగరంలోని పోస్టల్ కాలనీ హౌస్ నెంబర్ 27-21-19 చిరునామాతో ఈ కార్డు మంజూరు అయ్యింది. ఇప్పటికే జనసేనాని ఇక్కడ ఒక ఇల్లును అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటనను భీమవరం నుంచి పవన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here