సాయంత్రం 4 గం.లకు జనసేనాని భారీ బహిరంగ సభ

జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా గోదావరిజిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనను భీమవరంనుంచి ప్రారంభించనున్నారు. ఈరోజు అక్కడ సాయంత్రం 4గంటలకు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు జనసేన ఉపాధ్యక్షుడు బి. మహేంద్ర రెడ్డి ప్రకటించారు. ఈ సభను జాతీయ రహదారిలో పోలీస్ బొమ్మ దగ్గర ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల నాయకుల కోరిక మేరకు రెండు నియోజకవర్గాల పోరాట యాత్రకు భీమవరాన్నే కేంద్రంగా ఎంచుకున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here