పవన్ ఛానల్ న్యూ రికార్డ్.. కొన్ని రోజుల్లోనే టాప్ టెన్ లోనే చోటు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా మారి.. రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2019 ఎన్నికలపై దృష్టి పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా పోరాట యాత్ర తో ప్రజల మధ్య ఉంటూ పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ .. మీడియా సపోర్ట్ కోసం ఇటీవల 99 న్యూస్ చానల్ ను లీజుకు తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఛానల్ కు సంబంధించిన కార్యక్రమాలు ప్రసరమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఈ ఛానల్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
మీడియా ఫీల్డ్ లోకి పవన్ అడుగు పెట్టినప్పటి నుంచి రికార్డ్ స్థాయిలో దూసుకుపోతుంది. ఛానల్ ప్రారంభించిన తొలిరోజే యూట్యూబ్ లో 2 లక్షల మంది సబ్ స్క్రైబ్ అవ్వడం ఒక్క రికార్డు అయితే..ఛానల్ ప్రారంభించిన అతి కొద్దీ రోజులకే 15 లక్షల TRP రేటింగ్స్ ని సాధించి టాప్ 10 చానెల్స్ లో ఒక్కటిగా నిలిచింది. అంతేకాదు ఎన్నో సంవత్సరాలనుంచి నడుస్తున్న మీడియా సంస్థలు టిఆర్పీ రేటింగ్ లు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 99 టీవీ ఛానల్ కి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం..జనసేన పార్టీ సిదంతాలని ,ఆశయాలని నిరంతరం ప్రసారం చేసే 99 టీవీ ఛానల్ కి 15 లక్షల ఇంప్రెషన్స్ రావడం ని బట్టే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ కి జనాల్లో ఎటువంటి ఫాలోయింగ్ ఉందొ అని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాదు… జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికాగా 99 టివి ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోమని పోస్టులు పెడుతూ.. వీడియోలు షేర్ చేస్తూ.. మద్దతు తెలుపుతూ.. 99 ను సామాన్య జనంలోకి తీసుకుని వెళ్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here