విలువలతో కూడిన రాజకీయాల కోసమే పార్టీ పెట్టా : పవన్ కల్యాణ్

విలువలతో కూడిన రాజకీయాల కోసమే తాను పార్టీ పెట్టినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మంగళవారం ఏలూరులో మాట్లాడుతూ… డబ్బులతో కాకుండా, మేధోశక్తితో పార్టీని నడిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజకీయాలంటే సుదీర్ఘ పోరాటమని తెలుసని, తనదగ్గరికి వచ్చే ప్రతి పైసాకి లెక్క ఉంటుందని తెలిపారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రమే ఏలూరు చేరుకున్నారు.మంగళవారం ఉదయం పవన్ ప్రజా సంఘాలతో భేటీ అయ్యారు. అలాగే జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ నాయకులు సమావేసమయ్యి రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here