National

సుప్రీంకోర్టు జడ్జ్ మెంటే ఫైనల్ : యనమల

ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన అఫిడవిట్ల పై మండిపడ్డారు. సుప్రీంకోర్టును కూడా కేంద్రం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, రైల్వేజోన్ గురించి ఏదో చెప్పి ఏదేదో చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపట్టారు. విభజన చట్టం 10వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలను పంచేదిలేదని దాఖలు చేసిన ఆఫడవిట్ పై స్పందిస్తూ, దీనిమీద ఆల్ల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, జనాభా ప్రాతిపధికన పంచాలని చెప్పిందని,కానీ కేంద్ర ప్రభుత్వం దానిని కూడా విస్మరించి ఆఫడవిట్ దాఖలు చేసిందని, కేంద్రం ఎన్ని చేసినా, సుప్రీంకోర్టు జడ్జ్ మెంటే ఫైనల్ అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందన్నారు.శాసనసభ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. వైసీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ ని మోసం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శలు చేసారు.

Comment here