కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 3.1 నుండి 3.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందన్నారు. కోస్తాంధ్రలో ఒకటి,రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాగల మూడు రోజులు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here