ఫైనల్లో మరోసారి ఓడిన సింధూ

ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో మరోసారి ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. చైనాలోని నన్జింగ్ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సింధు-కరోలినా మారిన్, స్వర్ణం కోసం పోటీ పడ్డారు. తొలిగేమ్ లో మారిన్ కు సింధు గట్టిపోటీనిచ్చింది.ఒకానొక దశలో 17-18 పాయింట్లతో మారిన్ పై పైచేయి సాధించింది. అయితే వెంటనే తేరుకున్న మారిన్ పుంజుకుని 21-19తో తొలిగేమ్ ను మారిన్ గెలిచింది. రెండో గేమ్ ను కూడా ఇరువురూ పోటాపోటీగా ప్రారంభించినా, సింధు పైచేయి సాధించేలా కనపడినా,కరోలినా మారిన్ దూకుడుగా ఆడి, సిందుకు మరోఅవకాశం ఇవ్వకుండా 21-10 తో గెలిచి మూడోసారి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.అంతకుముందు 2014,2015 లలో కూడా విజేతగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here