జమిలి ఎన్నికల పై కీలక నిర్ణయం

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జమిలి ఎన్నికల విధానం పై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషన్ నెల రోజుల క్రితం వివిధ రాజకీయ పార్టీలపై సంప్రదింపులు జరపగా… తొమ్మిది పార్టీలు విభేదించగా.. నాలుగు మద్దతు తెలిపాయి. ఇక అధికార ప్రతిపక్షాలైన బిజేపీ, కాంగ్రెస్ లు డుమ్మా కొట్టాయి. కాగా జమిలి ఎన్నికల బదులు ఏడాదికి ఒక ఎన్నిక నిర్వహించడం మంచిది అని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ చెప్పారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బంది కావాలని… అంతేకాదు… రాజ్యంగ సవరణ చేయడం కూడా అవసరం అని దీనికి సమయం పడుతుంది కనుక ఏడాదికొ ఎన్నిక నిర్వహించడం బాగుంటుంది అని తాను భావిస్తున్నట్లు చెప్పారు.. కాగా ప్రధాని మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here