జనసేనలోకి మాజీమంత్రి చేరిక

మాజీమంత్రి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పారిశ్రామిక వేత్త ముత్తా గోపాలకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన గోపాలకృష్ణ, పవన్ కల్యాణ్ కోరిక మేరకు త్వరలోనే జనసేనలో చేరేందుకు అంగీకరించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తా గోపాలకృష్ణకు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు ఈ నెల 14న జనసేన పార్టీ ఎన్నికల ముందస్తు ప్రణాళికను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. విద్యా వ్యవస్థపై పార్టీ పాలసీ కమిటీ రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించిన రాజకీయ వ్యవహారాల కమిటీ, ఫిన్లాండ్ తరహాలో విద్యావిధానాలను ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా అమలు చేసే తీరుపై అధ్యయనం చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు జనసేన సంస్థాగత నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేశారు. అమరావతి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here