చంద్రబాబు గెటప్ తో రానా రెడీ..!!

బాలయ్య-ఎన్టీఆర్ బయోపిక్ పిక్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో కీలకమైన బాబు పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇటీవలే రానా పై ఓ టెస్ట్ షూట్ కూడా నిర్వహించి… తన గెటప్ కు మెరుగులు దిద్దుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో రానా సెట్స్ పైకి వెళ్ళనున్నాడట… ఒకటి పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశం కాగా… మిగతావి ఎన్టీఆర్ తో సాన్నిత్యంలో ఉన్నవి…రాజకీయ, కుటుంబ వ్యవహారాల్లో చంద్రబాబులా రానా కనిపించి సందడి చేయనున్నాడట… చంద్రబాబు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకున్న సమయంలో అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా సన్నివేశాలను తెరకెక్కించేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెకండ్ షెడ్యూల్ లో రానా కనిపించే సన్నివేశాలను చిత్రీకరణకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here