Crime News

నీరవ్ మోదీ, చోక్సీలకు కోర్టు సమన్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతడి మేనమామ మెహుల్ చోక్సీలకు ముంబయిలోని పిఎంఎల్ఏ కోర్ట్ సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ లోపు విచారణకు హాజరుకావాలనీ…లేని పక్షంలో వీరిద్దరినీ పరారీలో ఉన్న ఆర్థిక నెరగాళ్లుగా ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నీరవ్ మోదీ సెప్టెంబర్ 25న, మెహుల్ చోక్సీ సెప్టెంబర్ 26న కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. పరారీ హార్ధిక నేరగాళ్ల ఆర్డినెన్స్ – 2018 క్రింద నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లపై ఈనెల మొదట్లో ప్రత్యేక కోర్టు ముందు ఈడీ రెండు వేర్వేరు పిటీషన్ లను దాఖలు చేసింది. వీరిద్దర్నీ పరారీ ఆర్థిక నెరగాళ్లుగా ప్రకటించి…., భారత్, యూకే, యూఏఈ దేశాల్లో వీరికి చెందిన 3,500 కోట్ల రూ. చర, స్థిరాస్తులను జప్తు చేసేలా అనుమతించాలని ఈడీ కోరింది. తనపై ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను రద్దు చేయాలంటూ చోక్సీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈడీ ఈ నిర్ణయం తీసుకోవడం గమానార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోని కొందరు అధికారుల అండతో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు 13 కోట్ల రూ. మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే….KS

Comment here