Local news

హరికృష్ణ మృతితో కన్నీరు పెడుతున్న నిమ్మకూరు

స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్తా తెలియగానే… ఆయన స్వగ్రామం నిమ్మకూరులో తీవ్ర విషాదం నెలకొంది. హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జననం, విద్యాభ్యాసం పెళ్లి కూడా నిమ్మకురులో జరిగినట్లు హరికృష్ణతో ఉన్న అనుబంధాని గుర్తు చేసుకుని కన్నీరు పెడుతున్నారు. రాష్ట్రం విడిపోయిన వెంటనే హరికృష్ణ తన ఓటును స్వగ్రామానికి మార్చుకున్న అభిమాని అని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆయనకు నిమ్మకూరు అంటే అమితమైన ఇష్టమని.. ఆయన మృత దేహాన్ని ఇక్కడకు తీసుకుని రావాలని కొందరు కోరుకుంటున్నారు.

Comment here