International

బతుకమ్మ సంబరాల్లో న్యూజిలాండ్ ప్రధాని జేసిండా

తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు కూడా ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే న్యూజిలాండ్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆ దేశ ప్రధానమంత్రి జేసిండా పాల్గొని సందడి చేశారు. న్యూజిలాండ్ లోని తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ఆ దేశ ప్రధాని జేసిండా తెలంగాణ మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఈ ఫోటోలను తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న జేసిండాకు ధన్యవాదాలు తెలిపారు. ఓ దేశ ప్రధాని బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే న్యూజిలాండ్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Comment here