నీట్ ఏడాదికి ఒక్కసారే: వెనక్కి తగ్గిన కేంద్రం

జాతీయ అర్హత పరీక్ష “నీట్” ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని, అదీ ఆన్ లైన్లో నిర్వహించాలనే నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆన్ లైన్లో కాకుండా పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. “నీట్” 2019 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్ 1, 2018 నుంచి ప్రారంభమవుతుందని, మే 5 2019న పరీక్షను నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. జూన్ 5 2019న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. కాగా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జెఈఈ)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయితే నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తాననడం, ఆన్ లైన్లో నిర్వహిస్తాననడం వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి నిర్ణయాలతో గ్రామీణ, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here