45మంది పట్టే నౌకలో 250మంది… నీట మునిగి 200 మంది మృతి

సామర్థ్యానికి మించి నౌక లో ప్రయాణీకులు ఎక్కడంతో ఘోర ప్రమాదం సంభవించింది. నౌక నీట మునిగి.. దాదాపు రెండు వందల మంది మరణించారు. ఈ దారుణ ఘటన ఇండోనేషియా సుమత్రా దీవిలో టొబా సరస్సులో చోటు చేసుకుంది. రంజాన్‌ పవిత్ర మాసం ముగియటంతో సుమత్రా దీవిలోని ప్రజలు వేడుకకు సిద్ధమయ్యారు. దీంతో 45 మంది ప్రయాణికుల సామర్ధ్యమున్న ఓ నౌకలో దాదాపు 250 మంది ఎక్కారు. అయితే నౌక బరువెక్కడంతో అదుపుతప్పింది. ఈ క్రమంలో నౌక నీట మునిగింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ప్రయాణికులకు రక్షించేందుకు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. నౌక సరస్సులో 1500 అడుగుల లోతులో మునిగిపోయింది. దీంతో భారీ ప్రమాదం జరిగి 200 మంది జలసమాధి అయ్యారని ప్రభత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ప్రస్తుతం సరస్సులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here