National

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమీషన్ నోటీసులు ఇచ్చింది. విజయనగరం జిల్లాలో రహదారులు, వైద్య సదుపాయాలు లేక, వసతుల లేమితో గిరిజనులు ప్రాణాలు కోల్పోవడంపై నోటీసులు ఇచ్చింది. మీడియా కథనాలను జాతీయ మానవహక్కుల కమీషన్ సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చింది. దీనికి 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది. గర్భిణీని అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్ళటానికి ఆమె భర్త గ్రామస్తులతో కలసి 12 కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వచ్చింది. అంబులెన్స్ వద్దకు చేరకముందే, మధ్యలోనే ఆ మహిళ ప్రసవించగా, పుట్టిన శిశువు మృతి చెందాడు. ఈ ఘటన నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని జాతీయ మానవ హక్కుల కమీషన్ తెలిపింది. ఏడాదిగా జరిగిన ఇలాంటి ఘటనలు, తీసుకున్న చర్యలపై వివరాలు అందజేయాలని కమీషన్ ఆదేశించింది. బాధితురాలికి అందిన వైద్య సదుపాయం, పరిహారం వివరాలు అందజేయాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆదేశించింది.

Comment here