National

నరేంద్రమోదీకి మార్కెటింగ్ చేస్తున్న పారిశ్రామిక వేత్తలు: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార బాధ్యతలు పారిశ్రామికవేత్తలే చూసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాజస్థాన్ లోని ధోల్ పూర్ జిల్లా బరి సిటీలో మంగళవారం జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ టీవీల్లో ప్రధాని నరేంద్ర మోదీ 24 గంటలూ కనపడతారని, ఆయన పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయని అన్నారు. టీవీల్లో ఉచితంగా ఎవరూ కనిపించలేరు. అంతా ఉచితమే అయితే ప్రతి ఒక్కరూ టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. మార్కెటింగ్ కోసం కోట్ల రూపాయలు అవుతాయి. ప్రధాని మార్కెటింగ్ను పారిశ్రామికవేత్తలే చూసుకుంటారు. ఇందుకు ప్రతిగా వారికి ప్రధాని నరేంద్ర మోదీ కోట్లు ఇస్తుంటారు. అని రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేసారు. హిందూ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రాఫెల్ ఢీల్ తన్నుకుపోయిన నరేంద్రమోదీ 45 వేల కోట్ల. రూపాయల అప్పులున్న అనిల్ అంబానీకి దాన్ని కట్టబెట్టారని, దేశంలోనే అత్యంత సంపన్నులైన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ లాంటి వారికి 3 లక్షల కోట్ల రూపాయల వరకూ రుణాలను మాఫీ చేసిన ఘనత నరేంద్రమోదీ సర్కారుదేనని అన్నారు. నరేంద్రమోదీ తెచ్చిన ఆర్ధిక సంస్కరణల వల్ల బాగుపడింది కూడా 15 మంది నుంచి 20 మంది పారిశ్రామికవేత్తలేనని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

Comment here