Uncategorized

ఢిల్లీలో ఎన్డీయేకి వ్యతిరేక ర్యాలీ కి చంద్రబాబుకు పిలుపు : మమత

ఈ నెలలో డిల్లీలో ఎన్డీయే ప్రభత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. ఈర్యాలీ లో తప్పక హాజరు కావాలని కోరారు. బుధవారం పార్లమెంట్లో టిడిపి ఎంపీలు మమతను కలిశారు. ఈ సందర్భంగా జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై టీడీపీ ఎంపీలతో మమత చర్చించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమత పలువురు ప్రతిపక్ష నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. మమత ఢిల్లీలో మూడురోజులపాటు పర్యటించనున్నారు.2019 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ మీకు మద్దతు ఇస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, వచ్చే ఎన్నికల్లో ముందు బీజేపీని ఓడించిన తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని మమతా బెనర్జీ చెప్పారు. మరోవైపు టీడీపి ఎంపీలు కడప ఉక్కు పరిశ్రమపై రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ను కలసి వినతి పత్రాన్ని ఇచ్చారు. కేంద్రం ఉక్కుమంత్రి బీర్రేంద్రసింగ్ ను టీడీపీ ఎంపీలు కలసి కలసి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని ఇచ్చారు.

Comment here