ఆగస్ట్ 9న గుంటూరులో వైసీపీ గర్జన : బొత్స సత్యనారాయణ

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆగస్టు 9న గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో “దగాపై గర్జన” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పాల్గొంటారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎక్కడ తనను ఓడిస్తారోనని భయపడి, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్రంలో తాజాగా 16 లక్షల ఓట్లను తొలగించారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అన్ని విషయాలలో చంద్రబాబు ప్రజలను మోసం చేసారని తీవ్రంగా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here