చంద్రబాబు గారూ – ఆడిగేవాళ్ళెవరూ లేరనుకుంటున్నారా? : పవన్ కల్యాణ్

జనసేన పార్టీ ఆధ్వర్యంలో “2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సును” విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సమాజంలో కనిపించే దేవుడు రైతు అని, అటువంటి రైతును కన్నీళ్లు పెట్టించి, వారి భూముల నుంచి వాళ్ళను బయటికి పంపించి వేయడం చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందనిపవన్ కళ్యాణ్ అన్నారు. నాడు చంద్రబాబుతో మాట్లాడినప్పుడు 1850 ఎకరాల్లోనే రాజధానిని నిర్మిస్తామని చెప్పారని, ఆ భూములు కూడా అటవీ ప్రాంతం నుంచి తీసుకోవాలని చర్చ కూడా జరిగిందన్నారు. అందుకు భిన్నంగా ఇప్పుడు రాజధాని కోసం లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా? ఆడిగేవాళ్ళెవరూ లేరనుకుంటున్నారా? ప్రజలు తోలు తీస్తారు.., గుర్తుపెట్టుకోండి అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను కదిలించే శక్తి తనలో ఉందని, తననెవరూ కొనలేరని అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారని, ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేపడతామని, మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని, సీఎం ఇంటివద్ద కూర్చుంటామని హెచ్చరించారు. అమరావతిని ఆపేస్తాం.., రాజధానిని అడ్డుకుంటాం అని, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన పవన్ కల్యాణ్, కేసులు పెడితే ఎదురు తిరగండి, అండగా నేనుంటా మీకు అని ప్రజలకు పిలుపునిచ్చారు……. KS
8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here