ఏపిలో కాంగ్రెస్ కు పట్టిన గతే బిజేపికి పడుతుంది లగడపాటి జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు… అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్రత్యేక హోదా ఇవ్వక పొతే… అదే గతి పడుతుందని మాజీ ఎంపి లగడ పాటి రాజ్ గోపాల్ చెప్పారు. అంతేకాదు ప్రాణ త్యాగాలతో హోదా రాదని.,.. పోరాటాలతోనే హోదాను సాధించగలం అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే… పరిశ్రమల రాష్ట్రానికి వస్తాయని తద్వారా ఉద్యోగాలు లభిస్తాయని ఈ విషయం ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికలను ముందు సర్వే వివరాలను విడుదల చేస్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here