ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లలో గరిష్ట చిల్లరధరల అమలు : అకున్ సబర్వాల్

ఆదివారం థియేటర్ల యజమానులతో తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ భేటీ అయ్యారు.ఆగస్ట్ 1 నుంచి గరిష్ట చిల్లరధరలు అమలు తప్పనిసరి అని సబర్వాల్ సూచించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విక్రయ బిల్లుల విషయమై అకున్ సబర్వాల్ కు థియేటర్ల యజమానులు విజ్ఞప్తి చేశారు. విరామంలో సమయాభావం వల్ల బిల్లు ఇవ్వటం సాధ్యం కాదని యజమానులు వివరించారు. వివిధ కంపెనీల నీళ్ల బాటిల్స్ ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. సినిమా వీక్షించేందుకు వచ్చినవారు తమకు నచ్చిన కంపెనీ బాటిళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు.ఎమ్మార్పీతో పాటు నిర్దేశించిన పరిమాణం ప్యాకింగులపై ఉండాలని సూచించారు…… KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here