National

మోదీకి 11 వినతిపత్రాలు ఇచ్చిన కేసీఆర్

ప్రధాని నరేంద్రమోదీని కలసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఈ భేటీలో తెలంగాణా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 11 వినతిపత్రాలను ప్రధానమంత్రి మోదీకి ఇచ్చారు. రాష్ట్రంలోని రైల్వే ప్రోజెక్టులకు నిధులు ఇవ్వాలని, హైకోర్టు విభజన వెంటనే చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కొత్త జోన్ల విధానానికి ఆమోదం తెలపాలని, అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన సచివాలయంకోసం బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని, వెనుకబడిన జిల్లాలకు 450 కోట్ల రూ. నిధులివ్వాలని, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఐఐఎం, ఐటీఐఆర్ లను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కేసీఆర్ కోరారు.

Comment here