మోదీ నిఖార్సయిన ప్రజానాయకుడు : కంగనా రనౌత్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిఖార్సయిన ప్రజానాయకుడని ఆమె పేర్కొంది. రానున్న ఎన్నికల్లో మోదీకి మరోసారి భారత ప్రధానిగా అవకాశం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ప్రజాస్వామ్యానికి మోదీనే సరైన వ్యక్తి అని ఆమె చెప్పింది. మోదీ జీవితంలోని సంఘటనల ఆధారంగా “చలో జీతే హై” సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.ముంబయి లో ప్రదర్శించిన ఈ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ కు రంగనా రనౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తన జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారని, ఆయనకు మరోసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలన్నారు. ప్రధాని పదవికి ఆయన అర్హుడైన వ్యక్తి అని ఆమె కితాబిచ్చారు. మోదీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన బాల్యాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపారని కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రానికి దర్శకులుగా ఆనంద్ ఎల్.రాయ్, మహావీర్ జైన్ లు పనిచేశారు…..KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here