Local news

మంత్రి కాల్వ కు తప్పిన ప్రమాదం..

మంత్రి కాల్వ శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. ఆనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. టీడీపీ సీనియర్‌ నాయకుడు బాదన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి వెళ్తున్న మంత్రి కాల్వ వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో కారు టైరు పంక్చరై అదుపు తప్పి… మంత్రి కాన్వాయ్ ను వేగంగా ఢీ కొట్టింది. ఈ వాహనంలో మంత్రి కాల్వ తో పాటు… జడ్పీ చైర్మన్‌ నాగరాజు కూడా ఉన్నారు. ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

Comment here