జనం రాజకీయనాడి చెప్పే అనకాపల్లి ఎంపీ సీటుకోసం మంత్రిగారి తనయుడికి చినబాబు సాయం..

ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ సీటు ఎప్పుడు హాట్ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎందుకంటే ఈ సీటు ప్రజల రాజకీయ నాడి చెప్పే సీటు అని పేరు… ఇక ఇక్కడ నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన వారు ఉన్నారు.. ముఖ్యంగా అల్లు అరవింద్ ఇక్కడ నుంచి పోటీ చేయడంతో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. గతంలో అంటే 1989 ఎన్నికల్లో కేవలం 9 ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్ధి అప్పల నరసింహం ను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొణతాల రామకృష్ణ గెలిచి రికార్డ్ సృష్టించారు. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. ఇక మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ కూడా అనకాపల్లి నుంచి ఎంపీలు పోటీ చేశారు.. ముఖ్యంగా గంటా రాజకీయ ప్రస్తానం ఇక్కడ నుంచే మొదలైంది. తాజాగా ఈ సీటు పై అధికార పార్టీ దృష్టి పెట్టింది. మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్ పాత్రుడు తండ్రి రాజకీయ వారసత్వం తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అంతేకాదు.. తన రాజకీయ ఎంట్రీ కోసం రంగం కూడా రెడీ చేసుకుంటున్నాడు.. మంత్రి లోకేష్ తో విజయ్ కు మంచి స్నేహం ఉంది.. దీంతో తనకు టికెట్ ఖాయం అనే ధీమా తో ఉన్నాడు. ఎంపీగా పోటీ చేసే చాన్స్ ఇస్తే… గెలిచి చూపిస్తా అని చెబుతున్నల్టు టాక్.. లోకేష్ అండ ఉన్న విజయ్ అభ్యర్ధిత్వం పై మరి అధిష్టానం… ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here