Local news

అతిధులుగా హోటల్స్ లో అడుగు పెట్టి.. రహస్యంగా వ్యభిచారం

రోజు రోజుకీ వ్యభిచారాలకు అడ్డలుగా మారిన హోటల్స్ గురించి వెలుగులోకి వస్తున్నాయి. అతిధులుగా హోటల్స్ లోకి అడుగు పెట్టి… రహస్యంగా వ్యభిచారం చేస్తోన్నవారు అధికం అవుతున్నారు. గత కొన్ని రొజుల క్రితం ఓ స్టార్ హోటల్ లో భోజ్ పురి నటి వ్యభిచారం చేస్తూ… పట్టు బడగా… తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్లో వ్యభిచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ యువకుడితోపాటు ఇద్దరు డ్యాన్సర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.హోటల్ సిబ్బందికి ధ్రువీకరణ పత్రాలు చూపే క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పగా అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కధనం ప్రకారం.. రోడ్‌ నం.2లోని పార్క్‌హయత్‌ హోటల్‌కు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇబ్రహీం అనే విద్యార్థితోపాటు మరో ఇద్దరు యువతులు వచ్చారు. ఇబ్రహీం పేరుమీద అప్పటికే గది నమోదై ఉంది. గదికి సంబంధించిన తాళాల కోసం అతను హోటల్‌లోని రిసెప్షన్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది అతని గుర్తింపు పత్రాలను అడిగారు.
పక్కనే ఉన్న ఇద్దరు యువతుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే ముగ్గురు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చిన రిసెప్షన్‌ సిబ్బంది వారికి ఎలాంటి అనుమానం రాకుండా పక్కకు కూర్చోపెట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్‌కు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఎంబీఏ చదివినట్లు చెప్పాడు. తనకు సల్మాన్‌ అనే వ్యక్తితో ఉన్న పరిచయంతో ఇద్దరు యువతులను వ్యభిచారం కోసం తనకు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో అప్పగించారని తెలిపాడు. ఇందుకు తాను రూ.11 వేలు చెల్లించానని తెలిపాడు. అతనితోపాటు ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఇద్దరు యువతులు డాన్సర్లని.. వారిలో ఒకరు నగరానికి చెందిన అమ్మాయికాగా… మరొక అమ్మాయి పశ్చిమ బెంగాల్ కు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. వారిని పునరావాస కేంద్రానికి తరలించి ఇబ్రహీం పై కేసు నమోదు చేశారు… పరారీ లో ఉన్న సల్మాన్ కోసం వెదుకుతున్నారు.

Comment here