పెంపుడు కుక్క నాకినందుకు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న యజమాని

కొంతమంది తమ ఇళ్ళలో ఏదొక జంతువును పెంచుకోవడం దానిని ఒక ఫ్యామిలీ మెంబర్ లా భావించి కుటుంబం మొత్తం ఆడుకోవడం.. ముద్దు చేయడం సర్వసాధారణమే… ఇక పెంపుడు జంతువుల్లో అగ్రస్థానం శునకానికే లభిస్తుంది. కుక్కను తమ కుటుంబ సభ్యురాలిగా భావించి దానిని ఒక చంటి పిల్లలా జాగ్రత్తగా చూసుకునే వారు ఎందరో… ఇప్పటి వరకూ కుక్కను పెంచుకోవడం వల్ల లాభమే కాని నష్టం లేదు అని అందరూ భావించే వారు..
కాని ఈ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసే ఒక ఘ‌ట‌న అమెరికాలోని విస్ కాన్సిస్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

ఈ న‌గ‌రానికి చెందిన గ్రెగ్ మంట‌ఫెల్ (48) అనే వ్య‌క్తి ఇష్టంగా ప్రేమతో ఒక కుక్క‌ను పెంచుకుంటున్నాడు. అంద‌రిలాగే ఆయ‌న కుటుంబం కూడా ఆ కుక్క‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటూ వుంది. దానితో రోజు ఆట‌లాడుకోవ‌డం గ్రెగ్ కు అల‌వాటు. ఆ క్ర‌మంలో ఆ కుక్క గ్రెగ్ ముఖాన్ని, చేతుల‌ను, కాళ్ల‌ను త‌న నాలుక‌తో నాక‌డం కూడా జ‌రుగుతుండేది. ఆ కుక్క గ్రెగ్ ను త‌న నాలుక‌తో నాకుతున్న‌ప్పుడు దాని లాలాజలం నుంచి విడుద‌లైన బాక్టీరియా వ‌ల‌న అత‌నికి ఒక విచిత్ర‌మైన వ్యాధి సోకింది.

ఏన్నో లక్ష‌ల మందిలో ఒక‌రికి వ‌చ్చే ఈ అరుదైన వ్యాధిని గ్రెగ్ మొద‌ట్లో గుర్తించ‌లేదు. జ్వ‌రంగా వుంద‌ని ఆస్ప‌త్రికి వెళితే గ్రెగ్ ను ప‌రీక్షించిన వైద్యులు అత‌ను అరుదైన రక్తం ఇన్ ఫెక్ష‌న్ తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకున్నారు. వెంట‌నే వైద్యం చేసి అత‌ని చేతులను మోచేయి వ‌ర‌కు, కాళ్ల‌ను మోకాలు వ‌ర‌కు తీసేయాల‌ని, లేక‌పోతే ప్రాణాల‌కే ప్ర‌మాదమ‌ని చెప్ప‌డంతో గ్రెగ్ కుటుంబం ఖంగుతిన్నది.

పెంపుడు కుక్క గ్రెగ్ ను త‌న నాలుక‌తో నాక‌డం వ‌ల్ల‌నే ఈ వ్యాధి సోకింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో త‌న కాళ్లు, చేతులు తీసేయ‌డానికి గ్రెగ్ ఒప్పుకున్నాడు. అవి రెండూ తీసేసినా వ్యాధి ఇంకా పూర్తిగా న‌యం కాలేద‌ని, మ‌రికొన్ని స‌ర్జ‌రీలు చేయాల్సివుంటుంద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు. ముందు ముందు ముక్కు చివ‌రి భాగాన్ని ఆప‌రేష‌న్ చేసి తీసేయాల్సివుంటుంద‌ట‌.

గ్రెగ్ కు వ‌చ్చిన ఈ వ్యాధి సాధార‌ణంగా కుక్క‌లు, పిల్లుల లాలాజలంలో వుండే బ్యాక్టీరియా కార‌ణంగా సోకుతుంద‌ని డాక్ల‌ర్లు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి చాలా అరుదైన‌ద‌ని, జంతు ప్రేమికులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌మ పెంపుడు జంతువుల‌తో ఎప్ప‌టిలాగానే వుండ‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. ఇక గ్రెగ్ వైద్య ఖ‌ర్చుల నిమిత్తం గోఫండ్ మి వెబ్ సైట్ విరాళాలు సేక‌రించ‌డానికి ఆయ‌న బంధువులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here