Cinema

కరుణానిధి మ్యానరిజంను గుర్తు చేస్తున్న మంచు మనోజ్ ట్విట్

ప్రముఖ సీనియర్ నాయకుడు కరుణానిధి మృతి పట్ల తమిళ ప్రజలే కాదు… యావత్ సిని, రాజకీయ ప్రముఖులు కూడా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ తన ట్విట్టర్ వేదికగా ఆయన్ని గుర్తు చేసుకున్నారు.. ” తమిళ సినీ పరిశ్రమలో సినీ రచయితగా ప్రయాణం మొదలు పెట్టి.. ఐదు సార్లు సిఎం గా తమిళనాడును ఏలిన ఘనత మరియు చరిత్ర కరుణానిధిగారిది. డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఏభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గొప్ప నాయకుడు ఆయన. తమిళ ప్రజలకు తమిళనాడుకు ఆయన చేసిన సేవలు మరియు తమిళ సాహిత్యానికి ఆయన అందించిన ప్రోత్సాహం తోడ్పాటు మరువలేనివి, మాటల్లో చెప్పలేనివి. అందుకే ఆయనంటే ఎంతో గౌరవం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని మంచు మనోజ్ ట్విట్ చేశారు.. అంతేకాదు.. కరుణానిధి ని గుర్తు చేసే విధంగా ఆయన మ్యానరిజంను అనుకరిస్తూ.. పచ్చ కండువా నల్ల కళ్ళజోడు ఉన్న ఒక ఫోటోను పెట్టాడు.
https://twitter.com/HeroManoj1/status/1026843067356049409/photo/1

Comment here