కన్నాపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి ప్రకాశం జిల్లా వాసిగా గుర్తింపు

ఏపీ బిజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నెల్లూరు జిల్లా కావాలి లో ర్యాలీ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నాపై ఓ యువకుడు చెప్పు విసిరాడు. అతనిపై బిజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో బిజేపీ, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా కన్నాపై దాడి చేసిన తడిని కఠినంగా శిక్షించాలని బిజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీలో గుండా రాజ్యం నడుస్తోందని, బీజేపీపై వరుసగా దాడులు చేస్తున్న టీడీపీ రౌడీరాజ్యాన్ని అడ్డుకుంటామని కమలనాథులు హెచ్చరించారు. దాడికి పాల్పడగిన వ్యక్తిని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొట్టిపాటి మహేశ్వర రావుగా గుర్తించారు. అతడు టీడీపీ కార్యకర్త అని, ఆ పార్టీ నేతలు కావాలనే అతడితో దాడి చేయించారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే అతడు లారీ డ్రైవర్ అని.. తమ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here