దాదాపు 14మంది ప్రధానులతో అనుబంధం ఉన్న కరుణానిధి

డిఎంకె అధినేత మాజీ సిఎం కరుణానిధి తమిళ రాజకీయాల్లో ఓ అధ్యయనం. రాజకీయ రణరంగంలో అపర చాణక్యుడుగా పేరుగాంచిన కరుణానిధి తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారు. కలైంజ్ఞర్‌ గా పిలుచుకునే ఆయన రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాయకుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 1957 నుంచి 13సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కరుణానిధికి సీఎంగా ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ప్రధానిలుగా పనిచేసిన అందరితో కరుణానిధికి ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు 14 మంది ప్రధానులతో సత్సంబంధాలను కొనసాగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here