డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో 700 ఏఏఓ పోస్టులు

డిగ్రీ విద్యార్హతతో ఎల్ఐసీ లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీటిల్లో ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏఏవో) చెప్పుకోద‌గ్గది . ఈ పోస్టుకు ఎంపికైతే త‌క్కువ వ‌య‌సులోనే హోదా, ఆక‌ర్షణీయ వేత‌నం రెండూ సొంతమ‌వుతాయి. బ్యాంకు ప‌రీక్షలు ల‌క్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏఏవో కోసం ప్రయత్నించ‌వ‌చ్చు. ఈ రెండు ప‌రీక్షల సిల‌బ‌స్ దాదాపు ఒక‌టే. రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ విభాగాల్లో రాణించిన‌వాళ్లు ఎంపిక కావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయి. గ‌తంతో పోల్చుకుంటే ఈసారి పోస్టుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్షకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు: 700

విభాగాల‌వారీ: ఎస్సీ-106, ఎస్టీ-53, ఓబీసీ-192, అన్ రిజ‌ర్వ్‌డ్‌-349

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూలో చూపిన ప్రతిభ ద్వారా

విద్యార్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌

వ‌యోప‌రిమితి: డిసెంబ‌రు 1, 2015 నాటికి క‌నిష్ఠంగా 21 ఏళ్లు, గ‌రిష్ఠంగా 30
ఏళ్లు ఉండాలి. అంటే డిసెంబ‌రు 2, 1985 – డిసెంబ‌రు 1, 1994 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే
అర్హులు.
స‌డ‌లింపులు: ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు,
పీడ‌బ్ల్యుడీ(జ‌న‌ర‌ల్‌)కు ప‌దేళ్లు, పీడ‌బ్ల్యుడీ (ఎస్సీ,ఎస్టీ) 15 ఏళ్లు, పీడబ్ల్యుడీ(ఓబీసీ) 13 ఏళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉన్నాయి.

ద‌రఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు రుసుం: ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు రూ.వంద‌, మిగిలిన అంద‌రికీ రూ.600

చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 5, 2016

హాల్ టికెట్లు: ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఎల్ఐసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీలు: మార్చి 5, 6, 13

ప‌రీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌లో…చీరాల‌, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.
తెలంగాణ‌లో…హైద‌రాబాద్‌, హుజ‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, పెద్దప‌ల్లి, వ‌రంగ‌ల్‌.

ప‌రీక్షలో…
మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. అయిదు విభాగాల నుంచి ప్రశ్నలొస్తాయి.
అవి..రీజ‌నింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు వీటికి 90 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 90 మార్కులు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు 60 మార్కులు, కంప్యూట‌ర్ నాలెడ్జ్ టెస్ట్ 30 ప్రశ్నలు 60 మార్కులు. చివ‌రి విభాగం ఇంగ్లిష్‌లో 40 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి మార్కులు కేటాయించ‌లేదు. అంటే ఈ విభాగంలో అర్హత సాధిస్తే స‌రిపోతుంది. అర్హత మార్కుల‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ఈ విభాగంలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. త‌ప్పు స‌మాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ అర్హత మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి. ఈ మార్కుల‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ఆయా సెక్షన్ల వారీ ప‌రీక్ష రాసిన అభ్యర్థుల స‌గ‌టు ప్రతిభ ఆధారంగా ఏయే సెక్షన్లో క‌నీసం ఎన్ని మార్కులు రావాలో ఎల్ఐసీ గ‌ణిస్తుంది.

ఇంట‌ర్వ్యూ…
రాత ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూకు ఆహ్వానిస్తారు
ఎంపికైతే…
ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల‌కు రూ.17240 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. నెల‌కు రూ.40 వేలు వేత‌న రూపంలో అందుకోవ‌చ్చు.
కొత్త వేత‌న స్కేలు అమ‌ల్లోకి వ‌స్తే రూ.50 వేలు, ఆపైన‌ వేత‌నం ఆశించ‌వ‌చ్చు. వీటితోపాటు ప‌లు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి. ఎంపికైన‌వారికి ప్రొబేష‌న్ వ్యవ‌ధి ఏడాది. దీన్ని రెండేళ్లకు పొడిగించ‌వ‌చ్చు. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు నాలుగేళ్లపాటు ఎల్ఐసీలో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. దీనికోసం ఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మ‌ధ్యలో వైదొల‌గాల‌నుకుంటే రూ.2 ల‌క్షలు చెల్లించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here