కేంద్రాన్ని వదిలేసి సీఎంపై విమర్శలా? : శివాజీ

రాజధాని అమరావతిని ఆపేస్తామని చెబుతున్న నాయకులు, దాన్ని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని సినీనటుడు, ప్రత్యేక ఉద్యమకారుడు శివాజీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్, పవన్ ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అన్యాయం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుండా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే ఫలితామేంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 54 దేశాలు తిరిగినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, చంద్రబాబు లక్షకోట్ల రూ. విలువైన పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని శివాజీ గుర్తు చేశారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే రైళ్లు ఆపేందుకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్తంభింపజేసేందుకు తాను సిద్ధమని.., వారు సైతం కలసిరావాలని శివాజీ సవాల్ విసిరారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది సంకీర్ణ ప్రభత్వమేనని, గట్టిగా, ఐక్యంగా నిలబడితే ప్రత్యేక హోదా అదేవస్తుందని శివాజీ అభిప్రాయపడ్డారు. గుంటూరు కేజేఎస్ఎస్ ప్రాంగణంలో గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన “మేధావుల మౌనం-సమాజానికి శాపం” అనే సదస్సులో శివాజీతో పాటు ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ధార్మిక మండలి అధ్యక్షురాలు సత్యవాణి, ఇతర మేధావులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా పోరాటం కీలక దశకు చేరుకుందని, హోదా కోసం యువకులు ఆత్మహత్య చేసుకోవద్దని చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు….. KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here