గత నాలుగున్నారేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది: మురళీధరరావు

ముందస్తు ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఖర్చు అవుతుందని బీజేపీ నేత మురళీధరరావు విమర్శించారు. మంగళవారం మురళీధరరావు మీడియాతో మాట్లాడుతూ అదనపు ఖర్చుకు చంద్రశేఖర్ రావు బాధ్యాతారహిత రాజకీయాలే కారణమన్నారు. గత నాలుగున్నారేళ్లలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రామిసెస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ చూస్తే, నరేంద్రమోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చితే, చంద్రశేఖర్ రావు మాత్రం దళితులకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఎస్టీల విషయంలో చంద్రశేఖర్ రావు ప్రభత్వానికి నిజాయితీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇవే విషయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేత మురళీధరరావు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here