కియా సూపర్ లీగ్ లో స్మృతి మందాన సంచలనం

TAUNTON, ENGLAND - JULY 29: Smriti Mandhana of Western Storm bats during the Kia Super League match between Western Storm and Loughborough Lightning at the Cooper Associates County Ground on July 29, 2018 in Taunton, England. (Photo by Harry Trump/Getty Images)

టీమిండియా మహిళా జట్టు ఓపెనర్, టీ-20 జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన కియా సూపర్ లీగ్ లో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నమెంట్లో వెస్ట్రన్ స్ట్రోమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి మందాన ఎల్బొరో లైట్నింగ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయి ఆడింది. కేవలం 18 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేసిన స్మృతి మందాన 19 బంతుల్లో 52 పరుగులు చేసింది. కెఎస్ఎల్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో అర్ధశతకాన్ని నమోదు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. వాతావరణ కారణాల వల్ల 6 వర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఎల్బొరో లైట్నింగ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్ట్రెన్ స్టోమ్ జట్టు భారీ స్కోర్ సాధించేందుకు స్మృతి కృషి చేసింది. దీంతో 6 ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 85 పరుగులు సాధించింది. అనంతరం 86 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్బొరో లైట్నింగ్ జట్టు ఈ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 6 వర్లకు వికెట్ నష్టపోకుండా 67 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో వెస్ట్రన్ స్ట్రోమ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది….. KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here