మహేష్ ఫ్యామిలీ నుంచి మరో బాలనటుడు ఎంట్రీ

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీం హీరోలుగా ఉన్నారు.. కానీ ఆ కుటుంబం నుంచి బాలనటులు మాత్రం లేదు.. అయితే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి రోజు రోజుకీ బలనటుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే మహేష్ బావా సుదీర్ బాబు హీరోగా డిఫరెంట్ రోల్స్ నటిస్తూ… ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. తాజాగా సమ్మోహనం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.. ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ .. నెంబర్ వన్ సినిమా లో చిన్నప్పటి మహేష్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.. ఇక సుదీర్ బాబు పెద్ద కుమారుడు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ సినిమాలో జూ.నానిగా, విన్నర్ సినిమాలో సాయి ధర్మ తేజ్ కు.. తండ్రి సుదీర్ బాబు మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో జూనియర్ గా నటించి మెప్పించాడు. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆర్టిస్టు తెరంగేట్రం చేశాడు.. అతను ఎవరో తెలుసా..? ఈ శుక్రవారం రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న గూఢచారి సినిమాలోని అడవి శేష చిన్నప్పటి పాత్రలో కనిపించి మెప్పించిన చిన్నారి ఎవరో కాదు.. హీరో సుదీర్ బాబు రెండో కుమారుడు… దర్శన్.. ఈ బాలనటుడు మహేష్ బాబుకు స్వయనా మేనల్లుడు.. మొదటి సినిమాతోనే దర్శన్ తన నటనకు ప్రశంసలను అందుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here