కొంగరలాన్ లో భారీ వర్షం.. కూలిన కటౌట్లు

అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శనివారం రాత్రి కొంగరలాన్లో భారీ వర్షం పడింది. సభాప్రాంగణంలోకి నీరు చేరింది. ప్రాంగణంలో ఉన్న ఓ కటౌట్ కూలిపోయింది. భారీ వర్షానికి వేదిక తడిసిముద్దయ్యింది. ఇప్పటికే కొంగరలాన్ కు వివిధ జిల్లాల నుంచి ప్రజలు చేరుకున్నారు. వీరు ట్రాక్టర్లు, బస్సుల్లో సభాప్రాంగణానికి వచ్చారు. ఇప్పటి వరకు ఒక 50 వేల మంది దాకా సభకు చేరుకున్నారు. ఉన్నపళంగా వర్షం కురవడంతో తడిసిముద్దయ్యారు. ఆదివారం నిర్వహించ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు పూర్తియ్యాయి.సభ నిర్వహణకు కేసీఆర్ పలు కమిటీలను నియమించారు. సభ నిర్వహణ సమన్వయ కర్తలుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి లను నియమించారు. నిర్వహణ బాధ్యతల కోసం మరో 8 కమిటీలను నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here