ఐసీసీ టెస్ట్ బాట్సమెన్ నెంబర్ 1 కి చేరిన విరాట్ కోహ్లీ

ఐసీసీ టెస్ట్ బాట్సమెన్ నెంబర్ 1 కి చేరిన విరాట్ కోహ్లీ

తొలి టెస్టులో ఇండియా పరాజయం పాలైనప్పటికీ., విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనతోనే విరాట్ కోహ్లీని నెంబర్ వన్ టెస్ట్ బ్యాట్సమెన్ ను చేసింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ను వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ తొలి స్థానానికి చేరాడు. టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విరాట్ కెరీర్లో ఇదే తొలిసారి. ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్టులో 200 పరుగులు చేసాడు.దీంతో 31 పాయింట్లు సాధించి 934 పాయింట్లతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.దీంతో ఈ ఘనత సాధించిన ఇండియా ఆటగాళ్లలో ఏడవ ఆటగాడు కోహ్లీ. 2011లో సచిన్ తర్వాత ఈ రికార్డును అందుకున్నది విరాట్ కోహ్లీనే.గతంలో సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సచిన్, రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ నెంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ అందుకున్నవారిలో ఉన్నారు. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో జేమ్స్ ఆండర్సన్ మొదటి ర్యాంక్ లో.., రవీంద్ర జడేజా మూడవ ర్యాంక్ లోనూ, అశ్విన్ ఐదవ ర్యాంక్ లోనూ కొనసాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here