కిలిమంజారో పర్వతారోహణలో శివంగి రికార్డు

17 సంవత్సరాల శివంగి పాథక్ పర్వతారోహణలో సరికొత్త రికార్డును సృష్టించింది.ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన శివంగి తాజాగా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని మూడు రోజుల్లో అధిరోహించింది. ఆమె సాధించిన ఈ కొత్త రికార్డుకు ఇంకా అధికార ధ్రువీకరణ పత్రం అందాల్సి ఉంది. ఆనందం ఆపుకోలేని ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరికన్నా విభిన్నంగా ఉండాలని, ముందుండాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు.ఆరుణిమా సిన్హా వీడియోను తాను చూశానని, వెంటనే పర్వతారోహణపై పరిశోధన ప్రారంభించానని చెప్పారు. దాన్నుండి స్ఫూర్తి పొంది ఈ రికార్డును సాధించానని తెలిపారు. హిస్పార్ కి చెందిన శివంగి ఈ తన ప్రయాణంలో తన కుటుంబం అందించిన సహకారం మరువలేనిదని శివంగి అన్నారు…..KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here