కేరళను వణికిస్తున్న వర్షాలు… కొనసాగుతోన్న సహాయక చర్యలు

కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా 29 మంది మృతి చెందగా, 54వేల మంది నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా వచ్చిన వరదల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆర్మీ, నేవీ రంగంలోకి దిగి ఇప్పటి వరకూ సుమారు 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం ప్రత్యేకంగా 500ల ప్రత్యేక రక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతమైన కేరళ కు వచ్చిన వరదల్లో చిక్కుకున్న సుమారు 60 మంది టూరిస్టులను అధికారులు రక్షించారు.. అందులో 20 మంది విదేశీయులున్నారు. కేరళ సిఎం పినరాయి విజయన్..ముందపు ప్రాంతాలను ఎరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు.. వారికి అన్ని ఫుడ్, షెల్టర్ తదితర సదుపాయాలను కూడా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here